Rahul Gandhi: పార్లమెంట్ సాక్షిగా మోడీ, అదానీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Rahul Gandhi: దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతోంది
Rahul Gandhi: పార్లమెంట్ సాక్షిగా మోడీ, అదానీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Rahul Gandhi: దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతోందని..ఆయన అన్ని రంగాల్లో ఎలా రాణించారని తనను భారత్ జోడో యాత్రలో చాలా మంది ప్రశ్నించారని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ-అదానీ మధ్య సంబంధమేంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 20214లో 8 మిలియన్ డాలర్లు ఉన్న అదానీ ఆదాయం 2022లో 140 మిలియన్ డాలర్లకు ఎలా చేరుకుందని తనను అనేక మంది ప్రశ్నించారని లోక్ సభలో తెలిపారు. దేశీయ విమానాశ్రాయాల్లో అదానీ వాటా పెరుగుతోందని..కాంట్రాక్టులన్నీ అదానీకి అప్పగించడమేనా భారత్ పాలసీ అని రాహుల్ ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కువ ఆదాయం కలిగిన ముంబై ఎయిర్‌పోర్టును జీవీకే సంస్థ నుంచి లాక్కొని..ప్రభుత్వమే అదానీకి అప్పగించిందని రాహుల్ విరుచుకుపడ్డారు.
Next Story




