సైనికులకు అందించే ఆహార పదార్థాలపై రాహుల్ గాంధీ ఆందోళన

సైనికులకు అందించే ఆహార పదార్థాలపై రాహుల్ గాంధీ ఆందోళన
x
Highlights

శుక్రవారం రక్షణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీలో సభ్యునిగా ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..

శుక్రవారం రక్షణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీలో సభ్యునిగా ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా హాజరయ్యారు. సైనికులకు, ముఖ్యంగా సరిహద్దుల్లో మోహరించిన వారికి మెరుగైన ఆహారం, దుస్తులు మరియు ఇతర సౌకర్యాలు వంటి అంశాలపై ఈ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా హాజరయ్యారు. ఎజెండాలోని అంశాలు.. రక్షణ దళాలకు రేషన్ , బట్వాడా వస్తువులను నాణ్యతతో అందించడం , పర్యవేక్షించడం వంటివి ఉన్నాయి. ఈ కమిటీకి భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యుడు జువల్ ఓరం నేతృత్వం వహిస్తున్నారు. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం గురించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్, మాజీ రక్షణ మంత్రి శరద్ పవార్.. చర్చను కోరినప్పటికీ దీనిపై చర్చించలేదు.

అయితే భారత-చైనా సరిహద్దు సంఘర్షణపై తాజా పరిస్థితుల గురించి పవార్ బ్రీఫింగ్ అడిగినప్పుడు, జనరల్ రావత్ ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్నారు, దీనికి ఆయన సమాధానమిస్తూ.. సాయుధ దళాలు.. ప్యానెల్‌కు వ్రాతపూర్వక సమాధానం పంపుతాయని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అధికారులతో పోల్చితే సైనికులకు అందించే ఆహార పదార్థాలపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు, రక్షణ దళాలలో ర్యాంక్ ను పరిగణించకుండా ఆహారం అందించాలని ఆయన కమిటీకి సూచించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలకు రావత్ సమాధానమిచ్చారు.. ప్రస్తుతం ఆహారంలో గుణాత్మక వ్యత్యాసం లేదని నొక్కిచెప్పారు, కాని జవాన్లు ఎక్కువగా గ్రామీణ భారతదేశం నుండి వచ్చినందున, వారు రైస్, చపాతీ వంటి ఆహార పదార్థాలను ఇష్టపడుతున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories