Rahul Gandhi: కేరళలోని కోజికోడ్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం

Rahul Gandhi: సంపన్న వ్యాపారులకు మోడీ అండగా నిలుస్తున్నారు

Shashank Gullapelli
Published on: 16 April 2024 6:00 PM IST
Rahul Gandhi Election Campaigning In Kozhikode Kerala
X

Rahul Gandhi: కేరళలోని కోజికోడ్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం

Rahul Gandhi: కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు మోడీ.. ఓ సాధనంగా మారారని ఆరోపించారు. సంపన్నుల బ్యాంకు రుణాలు మాఫీ చేయించారని, ఇప్పటి వరకు సుమారు 25 మందికి దాదాపు 16 లక్షల కోట్లు మాఫీ చేయించారని రాహుల్ మండిపడ్డారు. దేశంలోని రైతుల సమస్యలపై ప్రధాని ఏనాడూ మాట్లాడరని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు మోడీకి పట్టవని రాహుల్ ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story