Rahul Gandhi: కేరళలోని కన్నూర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

Rahul Gandhi: దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని బీజేపీ చూస్తోంది

Shashank Gullapelli
Published on: 18 April 2024 5:56 PM IST
Rahul Gandhi Election Campaign In Kannur Kerala
X

Rahul Gandhi: కేరళలోని కన్నూర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

Rahul Gandhi: కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. బీజేపీపై విమర్శలకు పదునుపెట్టారు. దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ కుట్రలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని చెప్పారు. ఈడీ, సీబీఐని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకుని.. దేశ స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన యూడీఎఫ్.. దేశంలో వైవిధ్యాన్ని అంగీకరిస్తాయని రాహుల్ చెప్పుకొచ్చారు. దేశంలోని భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల మధ్య చిచ్చుపెట్టి.. రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story