నేడు గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ పరువు నష్టం కేసు విచారణ

Rahul Gandhi: సూరత్‌ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన రాహుల్‌గాంధీ

Jyothi
Published on: 29 April 2023 11:58 AM IST
Rahul Gandhi Defamation case will be Heard in the Gujarat High Court today
X

నేడు గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ పరువు నష్టం కేసు విచారణ

Rahul Gandhi: పరువు నష్టం కేసులో.. రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై ఇవాళ గుజరాత్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు విచారణలో భాగంగా.. సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్. జస్టిస్ గీతా గోపీ ఈ కేసును విచారించాల్సి ఉంది. ఐతే.. ఆమె ఈ కేసును విచారించేందుకు తిరస్కరించడంతో.. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ ముందుకొచ్చింది. ఆ క్రమంలో రాహుల్ వేసిన రివిజన్ పిటిషన్‌‌ ను ఇవాళ ఆయన విచారించనున్నారు. అయితే ఈ కేసులో సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇస్తారా లేక.. కింది కోర్టు తీర్పును సమర్థిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇక్కడ రాహుల్‌కి అనుకూలంగా తీర్పు రాకపోతే... సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంది.

2019 ఏప్రిల్ 13న..కర్నాటకలోని..కోలార్ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో అని హాట్ కామెంట్స్ చేశారాయన. 2019లో గుజరాత్‌లోని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ.. రాహుల్‌కి వ్యతిరేకంగా పరువునష్టం దావా వేశారు. 2023 మార్చి 23న సూరత్ లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. IPCలోని 499, 500 సెక్షన్ల కింద రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐతే.. రాహుల్ పైకోర్టుకు వెళ్లేందుకు వీలుగా... నెలపాటూ టైమ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Jyothi

Jyothi

Next Story