Bharat Jodo Nyay Yatra: యూపీలో రాహుల్ జోడో న్యాయ్‌ యాత్ర కుదింపు

Bharat Jodo Nyay Yatra: రాష‌్ట్రంలో 21కే ముగియనున్న భారత్ జోడో యాత్ర

Shekhar G
Updated on: 12 Feb 2024 8:15 PM IST
Rahul Gandhi Cuts Short Bharat Jodo Nyay Yatra In UP Due To State Board Exams
X

Bharat Jodo Nyay Yatra: యూపీలో రాహుల్ జోడో న్యాయ్‌ యాత్ర కుదింపు 

Bharat Jodo Nyay Yatra: అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఉత్తర్‌ప్రదేశ్‌ షెడ్యూల్‌ మారింది. ఆ రాష్ట్రంలో కొనసాగాల్సిన యాత్ర కాల వ్యవధిని తగ్గించినట్లు పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. యూపీలో 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ సవరణలు చేసినట్లు తెలిపారు.

రాహుల్‌ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్‌ మార్పులు చేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story