Rahul Gandhi: ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్నిప్రారంభించడంపై రాహుల్ గాంధీ విమర్శలు

Rahul Gandhi: ఇది పట్టాభిషేకం అంటూ రాహుల్ గాంధీ ట్వీట్

Jyothi
Published on: 28 May 2023 2:45 PM IST
Rahul Gandhi Criticizes PM Modi Inauguration of Parliament Building
X

Rahul Gandhi: ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్నిప్రారంభించడంపై రాహుల్ గాంధీ విమర్శలు

Rahul Gandhi: ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేక వేడుకలా పరిగణిస్తున్నామన్నారు. పార్లమెంట్ ప్రజల గొంతుక అని.. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని మోడీ పార్లమెంట్‌ను ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలన్నీ ఈ రోజు జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదు. అంతకుముందు కూడా పార్లమెంట్ గురించి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ అహం అనే ఇటుకలతో నిర్మించబడదని, రాజ్యాంగ విలువలపైనే నిర్మితమవుతుందని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story