బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi: తన సిద్ధాంతాలు, వరుణ్ సిద్ధాంతాలు వేర్వేరుగా ఉంటాయి

Jyothi
Published on: 17 Jan 2023 6:02 PM IST
Rahul Gandhi Comments On Varun Gandhi
X

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాహుల్ గాంధీ ఎంపీ వరణ్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుణ్ గాంధీ భావజాలం, తన భావజాలం పూర్తి విరుద్ధమన్నారు. తాను RSS కార్యాలయానికి వెళ్లే ప్రసక్తే లేదని అది జరగాలంటే తన తల తెగిపోవాలన్నారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని ఒకవేళ కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకు అదొక సమస్య కావొచ్చన్నారు. తనకు , తన కుటుంబానికి ఓ సిద్ధాంతం, భావజాలం ఉందని కానీ వరుణ్ మరొకదానిని అనుసరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాలను తాను అంగీకరించలేనని రాహుల్ గాంధీ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story