లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా రాహుల్‌గాంధీ

సిటీలోని ఓ స్వీట్ షాప్‌లోకి వెళ్లిన రాహుల్‌గాంధీ

Shashank Gullapelli
Published on: 13 April 2024 10:15 AM IST
Rahul Gandhi Busy in Lok Sabha election campaign
X

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా రాహుల్‌గాంధీ

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ఇందులో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో పర్యటించారు. శుక్రవారం సింగనళ్లూరులో ప్రచారం నిర్వహించిన ఆయన.. రాత్రి పొద్దుపోవడంతో విరామం తీసుకున్నారు. ఈ క్రమంలో సిటీలోని ఓ స్వీట్‌ షాప్‌లోకి వెళ్లి అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచారు. డివైడర్‌ దాటుకుని రోడ్డుకు అవతలివైపున్న స్వీట్ దుకాణానికి వెళ్లిన ఆయన.. షాప్‌లో ఫేమస్‌ స్వీట్‌ ఏంటని అక్కడున్నవారిని అడిగారు. మైసూర్‌పాక్‌ అని చెప్పడంతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ కోసం దానిని కొనుగోలుచేశారు. అనంతరం తనకు అత్యంత ఇష్టమైన గులాబ్‌ జామ్‌ను అక్కడే ఆరగించారు. షాపు సిబ్బందితో ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం సీఎం స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన రాహుల్‌.. ఆయనకు మైసూర్‌పాక్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story