Rahul Gandhi: వ్యాక్సినేషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi: భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2021 5:25 PM IST
Rahul Gandhi Asked the Government to Provide Booster Shots
X

Rahul Gandhi: వ్యాక్సినేషన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi: భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధిక జనాభాకు ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదన్న రాహుల్ ఇక బూస్టర్ డోసులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగితే డిసెంబర్ నెల ముగిసేసరికి 42శాతం జనాభాకే వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. థర్డ్‌వేవ్‌ను నివారించాలంటే డిసెంబర్ చివరికి కనీసం 60శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కావాలని రాహుల్ ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story