Rajnath Singh: అమేథీలో పోటీ చేసే ధైర్యం రాహుల్‌కు లేదు

Rajnath Singh: అమేథీలో ఓడిపోయి వయనాడ్‌కు రాహుల్ పారిపోయి వచ్చారు

Shashank Gullapelli
Published on: 18 April 2024 6:12 PM IST
Rahul Does Not Have The Courage To Contest In Amethi Says Rajnath Singh
X

Rajnath Singh: అమేథీలో పోటీ చేసే ధైర్యం రాహుల్‌కు లేదు

Rajnath Singh: పోటీ చేసే ధైర్యం రాహుల్ గాంధీకి లేదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాహుల్.. అక్కడి నుంచి కేరళలోని వయనాడ్‌కు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ తరఫున పతనమ్‌తిట్టలో రాజ్‌నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఈసారి వయనాడ్‌లోనూ గెలవరని, ఇక్కడి ఓటర్లు రాహుల్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story