Priyanka Gandhi: రాయ్‌బరేలీ, అమేథీ కాంగ్రెస్ అభ్యర్థులపై వీడని ఉత్కంఠ

Priyanka Gandhi: రాహుల్, ప్రియాంక గాంధీలు పోటీ చేసే విషయంపై రాని స్పష్టత

Shashank Gullapelli
Published on: 30 April 2024 1:32 PM IST
Rae Bareli And Amethi Congress Candidates Are In Suspense
X

Priyanka Gandhi: రాయ్‌బరేలీ, అమేథీ కాంగ్రెస్ అభ్యర్థులపై వీడని ఉత్కంఠ 

Priyanka Gandhi: కేంద్రలో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచిన కాంగ్రెస్... యూపీలో రెండు స్థానాలకు ఇంకా అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. రాయ్‌బరేలీ, ఆమేథీ లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరనే విష‍యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రెండు స్థానాలల్లో అధ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఖర్గేకు అప్పగించినట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలిపింది. యూపీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలుమాత్రం.. రాహుల్, ప్రియాంకలనే ప్రకటించాలని అగ్రనాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడానికి ప్రియాంకగాంధీ సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. అలాగే అమేథీ నుంచి పోటీ చేసే విషయంపై రాహుల్ గాంధీ ఇంకా నిర్ణయంతీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌లో అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలు పోటీ చేసే విషయంలోనే స్పష్టత లేకపోవడంతో.. అసలు పోటీ చేస్తారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story