Uttarakhand CM: నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

Uttarakhand CM: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Arun Chilukuri
Updated on: 3 July 2021 5:23 PM IST
Pushkar Singh Dhami to be the new Chief Minister of Uttarakhand
X

Uttarakhand: నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

Uttarakhand CM: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉత్తరాఖండ్‌లో గత నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రుల మార్పు జరగింది. నిన్న సీఎం పదవికి తీరథ్‌సింగ్ రావత్ రాజీనామా చేయగా తాజాగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ పదవ ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

మరోవైపు మార్చి 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్‌సింగ్ రావత్‌ ఆరు నెలల్లో ఎన్నికైతేనే పదవిలో కొనసాగే అవకాశం ఏర్పడింది. అయితే ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో తీరత్ సింగ్ రాజీనామా చేయక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ శాసనసభాపక్షం కీలక నిర్ణయం తీసుకుంది. ఘాటిమా నుంచి రెండు సార్లు గెలుపొందిన పుష్కర్‌సింగ్ ధామిని ఉత్తరాఖండ్ పదవ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story