కెనడాలో పంజాబ్‌కు చెందిన యువతి హత్య

కెనడాలో పంజాబ్‌కు చెందిన యువతి హత్య
x
Highlights

పంజాబ్‌కు చెందిన ఓ యువతి కెనడాలో హత్యకు గురైంది. అమన్‌ప్రీత్‌ సైనీ అనే యువతిని అదే రాష్ట్రానికి చెందిన మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు.

పంజాబ్‌కు చెందిన ఓ యువతి కెనడాలో హత్యకు గురైంది. అమన్‌ప్రీత్‌ సైనీ అనే యువతిని అదే రాష్ట్రానికి చెందిన మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు భారత్‌కు పరారైనట్లు తెలుసుకున్న అక్కడి పోలీసులు.. నిందితుడిపై అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. పంజాబ్‌కు చెందిన మృతురాలు సైనీ గత కొన్నేళ్లుగా టొరంటోలో నివసిస్తుంది. లింకన్‌ ప్రాంతంలోని ఓ పార్కులో గత వారం తీవ్ర గాయాలతో మృతి చెందింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా మృతదేహాన్ని కనుగొన్న కొద్దిసేపటికే మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. దాంతో మన్‌ప్రీత్ సింగ్‌పై హత్య కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అతడి ఫొటోను విడుదల చేసి కనిపిస్తే తమకు సమాచారం అందించాల్సిందిగా సూచించారు. నిందితుడి ఆచూకీ కోసం కెనడా అధికారిక వర్గాలు భారత్‌ను సంప్రదించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories