Chhattisgarh: కష్టాల కడలిలో కాంగ్రెస్.. పంజాబ్ లో సంక్షోభం తీరకుండానే..

Chhattisgarh: మూలిగేనక్కపై తాటి పండు పడిన చందంగా తయారైంది కాంగ్రెస్ హై కమాండ్ పరిస్థితి.

Arun Chilukuri
Updated on: 1 Oct 2021 9:30 PM IST
Punjab Like Situation in Chhattisgarh Congress
X

Chhattisgarh: కాంగ్రెస్ కు ఎడాపెడా సెగ

Chhattisgarh: మూలిగేనక్కపై తాటి పండు పడిన చందంగా తయారైంది కాంగ్రెస్ హై కమాండ్ పరిస్థితి. పంజాబ్ లో సంక్షోభం సద్దుమణగక ముందే ఛత్తీస్ గఢ్ పరిణామాలు కంగారు పెడుతున్నాయి. ఒప్పందం ప్రకారం అధికార బదలాయింపుకు సీఎం భూపేష్ భాగెల్ అడ్డం తిరగడంతో సమస్య క్లిష్టంగా మారింది. 25 మంది కాంగ్రెస్ నేతలను వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లిన బాగెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని ఇచ్చేందుకు అంగీకరించడం లేదు.

బాగెల్ కు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జతకట్టడంతో ఏం చేయాలో తోచని అధిష్టానం ట్రబుల్ షూటర్ కమల్ నాథ్ ను రంగంలోకి దించింది. హుటాహుటిన టెన్ జన పథ్ చేరిన కమల్ నాథ్ పరిస్థితిని సమీక్షించారు. సోనియాతో భేటీ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story