Punjab: పంజాబ్‌లో ఆప్‌ సర్కార్‌కు గవర్నర్‌ షాక్‌

Punjab: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు అనుమతి నిరాకరణ

Rama Rao
Published on: 22 Sept 2022 2:22 PM IST
Punjab governor says no to special assembly session
X

Punjab: పంజాబ్‌లో ఆప్‌ సర్కార్‌కు గవర్నర్‌ షాక్‌

Punjab: పంజాబ్‌లో ఆప్‌ సర్కార్‌కు షాక్‌ ఇచ్చారు గవర్నర్‌. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు గవర్నర్‌ అనుమతి నిరాకరించారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు పోరు బాట పట్టారు. గవర్నర్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌ వరకు ఎమ్మెల్యేలు శాంతి మార్చ్‌ నిర్ణయించారు. పంజాబ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ జరిగిందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ తరహాలో పంజాబ్‌లో కూడా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చి సడెన్‌గా నిరాకరించడంతో ఆప్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావడానికి పేర్కొన్న కొన్ని నిబంధనలు సరిగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Rama Rao

Rama Rao

Next Story