Punjab Politics: త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్

* ఊహించని మలుపులు తిరుగుతున్న పంజాబ్ రాజకీయాలు * బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న అమరీందర్‌ సింగ్

Sandeep Reddy
Published on: 20 Oct 2021 7:11 AM IST
Punjab Former Captain Amarinder Singh is Going to Form a new Political Party Soon
X

త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్(ఫైల్ ఫోటో)

Amarinder Singh: పంజాబ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌గా మారనున్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన.. త్వరలోనే ఓ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలతో కలిసిన అమరీందర్‌ ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది.

అయితే అమరీందర్‌ సింగ్ స్వయంగా పార్టీని పెడుతున్నట్లు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ మేరకు అమరీందర్‌ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. పంజాబ్ ప్రయోజనాల కోసం, ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతుల కోసం తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు అమరీందర్ సింగ్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story