బిజెపి గూటికి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. బిజెపిలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ విలీనం

*పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన కిరణ్ రిజిజు

Rama Rao
Updated on: 19 Sept 2022 9:01 PM IST
Punjab EX CM Amarinder Singh Joins BJP | Telugu News
X

బిజెపి గూటికి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. బిజెపిలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ విలీనం

Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్..బిజెపి గూటికి చేరారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజిజు, బీజేపీ పంజాబ్ చీఫ్ అశ్విని శర్మ సమక్షంలో అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ కండువాను కప్పిన కిరణ్ రిజిజు..అమరీందర్‌ సింగ్‌ను కాషాయ పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సభ్యత్వ నమోదు రశీసును నరేంద్ర సింగ్ తోమర్ అందించారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు అమరీందర్‌సింగ్ ప్రకటించారు. మోడీ ఆధ్వర్యంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నట్లు అమరీందర్‌ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అమరీందర్‌ సింగ్‌కు గవర్నర్ పదవి ఇస్తారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story