Punjab: సంక్షోభం ఇక ముగిసిన అధ్యయనం అని రాహుల్ ట్వీట్

Punjab: పంజాబ్ కాంగ్రెస్‌ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది.

Arun Chilukuri
Published on: 23 July 2021 5:29 PM IST
Punjab Crisis Has Been Resolved Says Rahul Gandhi
X

Punjab: సంక్షోభం ఇక ముగిసిన అధ్యయనం అని రాహుల్ ట్వీట్

Punjab: పంజాబ్ కాంగ్రెస్‌ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో రాజీ ఫార్ములా ప్రకారం పీసీసీ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ హాజరయ్యారు. దీంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరి మధ్యా విభేదాలకు తెరదించాలని హైకామాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లయింది.

మరోవైపు ఈ కార్యక్రమానికి పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ సైతం హాజరయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సిద్ధూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు రాసిన లేఖలో కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం ఇక ముగిసిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ ట్వీట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story