రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం.. వధువు ఎవరంటే..

Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.

Arun Chilukuri
Updated on: 6 July 2022 3:30 PM IST
Punjab CM Bhagwant Mann will get Married
X

రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం.. వధువు ఎవరంటే..

Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో జరగనుందని తెలుస్తోంది. భగవంత్ మాన్ ఆరు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆయన మొదటి భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. తాజాగా తన తల్లి, సోదరి స్వయంగా ఎంపిక చేసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ వివాహం చేసుకోనున్నారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు ఆప్‌ నేతలు, పంజాబ్‌ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story