పంజాబ్‌లో కొలువుదీరిన కొత్త క్యాబినెట్.. భగవంత్ మాన్ సారథ్యంలో 10మంది మంత్రులు..

Bhagwant Mann Cabinet: రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం...

Shireesha
Updated on: 22 March 2022 11:42 AM IST
Punjab CM Bhagwant Mann New Cabinet Formed with 10 Ministers | Live News
X

పంజాబ్‌లో కొలువుదీరిన కొత్త క్యాబినెట్.. భగవంత్ మాన్ సారథ్యంలో 10మంది మంత్రులు..

Bhagwant Mann Cabinet: పంజాబ్‌లో కొత్త కేబినెట్ అట్టహాసంగా కొలువుదీరింది. సీఎం భగవంత్ మాన్ సారథ్యంలోని 10 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళ సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం భగవంత్‌ మాన్. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్‌గా కుల్తార్‌సింగ్ సంథ్‌వాన్‌ను నామినెట్ చేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 సీట్లను కైవసం చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు.

Shireesha

Shireesha

Next Story