Pulse Polio: పల్స్ పోలియో తేదీ ఖరారు

X
Highlights
కరోనా వ్యాక్సినేషన్ కారణంగా వాయిదా వేసిన నేషనల్ ఇమ్యునైజేషన్ డే (పల్స్ పోలియో)ను జనవరి 31న నిర్వహించ...
Arun Chilukuri14 Jan 2021 11:34 AM GMT
కరోనా వ్యాక్సినేషన్ కారణంగా వాయిదా వేసిన నేషనల్ ఇమ్యునైజేషన్ డే (పల్స్ పోలియో)ను జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గురువారం ప్రకటించింది. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని తొలుత కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పల్స్ పోలియో కార్యక్రమం తేదీని మార్చినట్టు తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. జనవరి 30న ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.
Web TitlePulse polio vaccination on January 30
Next Story