Pulse Polio 2024: నేడు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం

Pulse Polio 2024: 'నేషనల్ ఇమ్యునైజేషన్ డే' సందర్భంగా పల్స్ పోలియో

Jyothi
Published on: 3 March 2024 9:26 AM IST
Pulse Polio Immunization Campaign Today In Telugu states
X

Pulse Polio 2024: నేడు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం

Pulse Polio 2024: నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో పల్స్‌ పోలియో కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హెల్త్‌ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలతో సహా పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, విమానాశ్రయంలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చుక్కలు వేస్తారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో రాత్రి 8 గంటల వరకు పల్స్‌ పోలియో చుక్కలు వేస్తారు. మార్చి 3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని.. 4, 5 తేదీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అధికారులు కోరారు.

Jyothi

Jyothi

Next Story