PSLV–సీ50 ప్రయోగం విజయవంతం

PSLV–సీ50 ప్రయోగం విజయవంతం
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. PSLV సిరీస్ విజయాల్లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టింది. PSLV–సీ50 రాకెట్‌ను...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. PSLV సిరీస్ విజయాల్లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టింది. PSLV–సీ50 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. PSLV–సీ50 రాకెట్‌ ద్వారా CMS-01 శాటిలైట్‌‌ను నింగిలోకి పంపింది. సీఎంఎస్‌-01 శాటిలైట్ ఏడేళ్లపాటు సేవలు అందించనుంది. అంతేకాదు, సీఎంఎస్‌-01 శాటిలైట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అలాగే, సీ-బ్యాండ్ సేవల విస్తరణకు ఉపయోగపడనుంది.

షార్ నుంచి ఇది 77వ మిషన్ కాగా, PSLV సిరీస్‌లో ఇది 52వ ప్రయోగం. అలాగే, ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. PSLV – సీ50 ప్రయోగం విజయవంతం కావడంతో భారత సాంకేతిక వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. అలాగే, అత్యాధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ మన సొంతం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories