విజయాల ఇస్రో..హాఫ్ సెంచరీకి రెడీ

విజయాల ఇస్రో..హాఫ్ సెంచరీకి రెడీ
x
Highlights

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్‌వీ సీ 50 నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయ్. షార్‌లోని...

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్‌వీ సీ 50 నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయ్. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇది సక్సెస్ అయితే సాంకేతిక వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 52వ ప్రయోగం కావడం.

అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతంకానుంది. ఇవాళ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయ్. దీనికి సంబంధించి రాకెట్ అనుసంధాన పనులు వేగవంతం అయ్యాయ్. ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలవగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది.

ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. మన దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన సీఎంఎస్ 01ను నింగిలోకి ఈ ఉపగ్రహం ద్వారా చేర్చనున్నారు. ఇస్రో చేపట్టే పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 52వ ప్రయోగం. ఈ ప్రయోగంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో మరింత వేగవంతంగా సమకూర్చనుంది. ఇప్పటికే సేవలందిస్తున్న శాటిలైట్లకు ఈ ప్రయోగం అనుసంధానం చేస్తే మెరుగైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

ప్రయోగం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి చెంత పీఎస్ఎల్వీ సీ50 నమూనాకు పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అర్చకులు ఆశీర్వచనం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories