సినీ నిర్మాత కృష్ణకాంత్‌ గుండెపోటుతో మృతి

సినీ నిర్మాత కృష్ణకాంత్‌ గుండెపోటుతో మృతి
x
Highlights

ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.కె.కృష్ణకాంత్ బుధవారం (సెప్టెంబర్ 30) గుండెపోటు కారణంగా చెన్నైలో మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. నివేదికల ప్రకారం,...

ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.కె.కృష్ణకాంత్ బుధవారం (సెప్టెంబర్ 30) గుండెపోటు కారణంగా చెన్నైలో మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. నివేదికల ప్రకారం, కృష్ణకాంత్ గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం గత శనివారమే డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. అయితే బుధవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

అయితే కృష్ణకాంత్ అప్పటికే మృతిచెందారని చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో కృష్ణకాంత మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఆ తరువాత కోవిడ్ నిబంధనలు పాటించి అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా శింబు నటించిన మన్మథుడు,కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి చిత్రాలను కృష్ణకాంత్ నిర్మించారు. దర్శకుడు సుబ్రమణ్యం శివ కృష్ణకాంత్ మృతిపట్ల ఎమోషనల్ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా గతంలో ఆయనతో కలిసి దిగిన పాత చిత్రాన్ని పంచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories