Priyanka Gandhi: ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Nov 2024 12:19 PM IST
Priyanka Gandhi Takes Oath As Wayanad MP
X

Priyanka Gandhi: ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పార్లమెంట్‌కు హాజరయ్యారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. తన చేతిలో ఉన్న రాజ్యాంగ పుస్తకం చూపిస్తూ ప్రియాంక ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకకు పలువురు అభినందనలు తెలిపారు. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆమె సభకు హాజరయ్యారు.

ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సారే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగగా.. 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆమె భారీ విజయం సాధించారు. ప్రియాంక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమె పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా హాజరై తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story