Priyanka Gandhi: బీజేపీ హయాంలో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం

Priyanka Gandhi: బీజేపీ విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అయ్యాయని ప్రియాంక గాంధీ విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 May 2024 8:30 PM IST
Priyanka Gandhi Says There Has Been No Employment Generation
X

Priyanka Gandhi: బీజేపీ హయాంలో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం

Priyanka Gandhi: బీజేపీ విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అయ్యాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఓ వైపు చిన్న పరిశ్రమలు కుదేలవుతుంటే... బిలియనీర్లు సంపదను పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం ప్రియాంక హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆమె ప్ర‌సంగించారు. బీజేపీ విధానాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ హయాంలో ఉపాధి కల్పన ఊసేలేదని ఆరోపించారు. ఇండియా బ్లాక్ అధికారంలోకి రాగానే చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తామని హామి ఇచ్చారు ప్రియాంక.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story