Priyanka Gandhi: యోగి ఆదిత్యనాథ్ ఇలాకాలో ప్రియాంక ప్రచారం
Priyanka Gandhi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రియాంక వాద్రా ధ్వజం
ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ప్రచారం (ఫైల్ ఇమేజ్)
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలన అరాచకంగా ఉందని, ప్రజలను వర్గాలుగా విడదీసి వారిపై రోజూవారి దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అన్నారు. గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. దళితులు, శ్రామికులు, ఓబీసీలు, పేదప్రజలు, మైనారిటీలు, బ్రాహ్మణులను బీజేపీ వంచించి, మోసం చేస్తోందని ప్రియాంక ఫైర్ అయ్యారు. మరోవైపు బీజేపీతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తోందన్న ఎస్పీ, బీఎస్పీలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. చావనైనా చస్తాం కానీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు.
Next Story




