యూపీ సీఎం కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ

UP Elections 2022: రసవత్తరంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలు...ప్రియాంకా గాంధీ కీలక ప్రకటన.

Sriveni Erugu
Published on: 21 Jan 2022 3:21 PM IST
Juicy UP Assembly Elections
X

రసవత్తరంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలు

UP Elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.. కాంగ్రెస్ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రియాంకా గాంధీ కీలక ప్రకట చేశారు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను ఉన్నట్టు ప్రియాంక స్వయంగా ప్రకటించారు. ఢిల్లీలో యూపీ యూత్‌ మేనిఫోస్టోను కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా.. యూపీలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైనా కనిపిస్తున్నారా? అంటూ ప్రియాంక నవ్వుతూ సమాధానమిచ్చారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రియాంకా గాంధీ నిర్ధారించారు. దీంతో యూపీలో ముందే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి.. యోగి అదిత్యనాథ్‌, అఖిలేష్‌ యాదవ్‌లకు ప్రియాంకా గాంధీ సవాల్‌ విసిరారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story