Top
logo

Narendra Modi Ladakh Visit: భారత - చైనా సరిహద్దుకు చేరిన ప్రధాని మోడి..

Narendra Modi Ladakh Visit: భారత - చైనా సరిహద్దుకు చేరిన ప్రధాని మోడి..
X
Narendra Modi Ladakh Visit
Highlights

Narendra Modi Ladakh Visit: భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి భారత - చైనా సరిహద్దు

Narendra Modi Ladakh Visit: భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి భారత - చైనా సరిహద్దు రేఖకు అతిసమీపంలో సముద్రమట్టానికి 11 వేల మీటర్ల ఎత్తులో ఉన్న " నిమూ " పోస్ట్ ను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి 14 ఆర్మీ కాప్స్ హెడ్ క్వార్టర్ ను సందర్శించి, సైనికులతో సమావేశం కానున్నారు. అంనతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం జూన్ 15 ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించనున్నారు.

అనంతరం జూన్ 15 ఘటనలో గాయపడిన సైనికులను లేహ్ హాస్పటల్ లో పరామర్శించనున్నారు. కాగా సైనిక ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్రమోడికి జూన్ 15 ఘటన , ఆ తర్వాత జరిగిన పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన మోడి భారత భూభాగాన్ని రక్షించుకోవడానికి సైన్యానికి అన్నిరకాల మద్దతు, స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుమతి ఇస్తామని ప్రకటన చేసారు. ఇక ఈ పర్యటనలో మోడితో పాటు ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ ఛీఫ్ నరవాణే ఉన్నారు.


Web TitlePrime Minster of India Narendra Modi Visited Ladakh
Next Story