Ahmedabad: అహ్మదాబాద్‌కు బ్రిటన్‌ ప్రధాని బోరీస్‌ జాన్సన్

Ahmedabad: భారత్‌లో బోరిస్‌ రెండ్రోజుల పర్యటన

Rama Rao
Published on: 21 April 2022 11:40 AM IST
Prime Minister of the United Kingdom Boris Johnson Arrives in Ahmedabad
X

Ahmedabad: అహ్మదాబాద్‌కు బ్రిటన్‌ ప్రధాని బోరీస్‌ జాన్సన్

Ahmedabad: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(Boris Johnson) రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్నారు. బ్రిటన్‌ నుంచి నేరుగా ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన అధికారులు, వ్యాపారవేత్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఆయన ఇక్కడి వ్యాపారవేత్తలో సమావేశం కానున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే బోరిస్‌ సిద్ధమవుతున్నారని బ్రిటన్‌లో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బ్రిటన్‌లో గుజరాత్‌కు చెందిన భారత సంతతి వారే అధికంగా ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకే బోరిస్‌ పర్యటనకు వెళ్లినట్టు చెబుతున్నాయి. ఇక బోరీస్‌ రేపు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలోనూ బ్రిటన్ ప్రధాని భారత్‌ పర్యటన ఎంతో ప్రాధాన్యం నెలకొంది. ఉక్రెయిన్ విషయమై నరేంద్ర మోదీతో చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story