Narendra Modi: ఇవాళ జిల్లా కలెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Narendra Modi: పథకాల పురోగతిని తెలుసుకోనున్న మోడీ

Rama Rao
Updated on: 22 Jan 2022 9:01 AM IST
Prime Minister Narendra Modi Video Conference with District Collectors Today
X

ఇవాళ జిల్లా కలెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Narendra Modi: ప్రధాని మోడీ ఇవాళ వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై నేరుగా అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ ఇంటరాక్షన్ ప్రభుత్వ యంత్రాంగం పనితీరును సమీక్షించడానికి, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడానికి ప్రధాని మోడీకి సహాయపడనుంది. మిషన్ మోడ్‌లో జిల్లాల్లోని వివిధ శాఖల ద్వారా వివిధ పథకాల సంతృప్తతను సాధించడం, అందరితో కలిసిపోవడమే దీని లక్ష్యం అని ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story