PM Modi: ఢిల్లీ మెట్రోలో జాలీజాలీగా ప్రధాని ప్రయాణం

PM Modi: ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మోడీ

Shekhar G
Published on: 30 Jun 2023 12:45 PM IST
Prime Minister Narendra Modi Journey in Delhi Metro
X

PM Modi: ఢిల్లీ మెట్రోలో జాలీజాలీగా ప్రధాని ప్రయాణం

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలో ఆయన ప్రయాణికులతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో యువతీ, యువకులు, మహిళలతో మోడీ ఎంతో ఆత్మీయంగా, నవ్వుతూ ముచ్చటించారు.

చాలా కాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితులతో మాట్లాడినట్లుగా వీరి హావభావాలు కనిపించాయి.ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీ టెక్నాలజీ ఫ్యాకల్టీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరిస్తారు.

Shekhar G

Shekhar G

Next Story