పెరిగిన మోడీ ఆస్తి.. నష్టాల్లో అమిత్ షా!

పెరిగిన మోడీ ఆస్తి.. నష్టాల్లో అమిత్ షా!
x
Highlights

Narendra Modi Assets : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తీ గత ఏడాది కాలంలో రూ. 36 లక్షలు పెరిగింది. గత ఏడాది 2.49కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది జూన్ లో ఇది 2.85 కోట్లుగా ఉందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

Narendra Modi Assets : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తీ గత ఏడాది కాలంలో రూ. 36 లక్షలు పెరిగింది. గత ఏడాది 2.49కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది జూన్ లో ఇది 2.85 కోట్లుగా ఉందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు పెరగగా, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు పెరిగాయి. అటు మోడీ ఎలాంటి లోన్ లు తీసుకోలేదు. అంతేకాకుండా అయన పేరు మీద కూడా ఓ సొంతవాహనం కూడా లేదు. ఇక మోడీ చేతికి నాలుగు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. వాటి బరువు 45 గ్రాములు, వాటి విలువ సుమారు రూ. 1.5 లక్షలు.. ఇక గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లోని సెక్టార్-1లోని ఓ ఫ్లాట్ ఉంద‌ని దానికి ముంబైలోని మరో ముగ్గరు జాయింట్ ఓనర్స్‌‌ ఉన్నట్టుగా మోడీ పీఎంవోకు సమర్పించిన డిక్లరేషన్‌‌‌లో పేర్కొన్నారు.

అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆస్తి 2019లో రూ. 32 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.28.63కోట్లకు తగ్గినట్టుగా డిక్లరేషన్ లో పేర్కొన్నారు. ప్రధాని, హోంమంత్రితో పాటుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా సీనియర్ మంత్రులందరూ తమ సంపదలను వెల్లడించారు. రామ్‌దాస్ అథవాలే, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి సహా కొందరు జూనియర్ మంత్రులు తమ డిక్లరేషన్లను ఇంకా దాఖలు చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories