PM Modi: రేపు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన

* అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్న ప్రధాని * రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం

Sandeep Reddy
Updated on: 14 July 2021 8:46 PM IST
Prime Minister Modi Will Visit Varanasi Tomorrow
X

మోడీ (ఫైల్ ఫోటో)

PM Modi: రేపు వారణాసిలో ప్రధానమంత్రి మోడీ పర్యటించనున్నారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. 744కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు దాదాపు 839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని ఎంసీహెచ్‌లో 100 పడకల ఆస్పత్రితో పాటు మల్టీ పార్కింగ్‌, గంగానదిలో పర్యాటకాభివృద్ధికి ఉద్దేశించిన రోరో బోట్లను ప్రధాని ప్రారంభించానున్నారు. మధ్యాహ్నం జపాన్ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అండ్ కన్వెన్షన్‌ సెంటర్ రుద్రాక్ష్ ను సందర్శించనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story