PM Modi: నేడు నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: బీదర్ నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌ రానున్న మోడీ

Jyothi
Published on: 3 Oct 2023 8:09 AM IST
Prime Minister Modi Visit to Nizamabad District Today
X

PM Modi: నేడు నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన 

PM Modi: నేడు నిజామాబాద్ పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. ప్రధాని పర్యటనలో మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గం ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు మార్గాల విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ-17 సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద 516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు. నిజామాబాద్‌ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం 8వేల,21 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story