ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

K V D Varma
Updated on: 16 Jan 2021 11:47 AM IST
Corona Vaccination launched by Prime Minister Modi
X

కరోనా వాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ 

ప్రపంచలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 3వేల6 కేంద్రాలను వర్చువల్‌ విధానం అనుసంధానం చేస్తారు. ప్రతి కేంద్రంలో తొలి రోజు 100 మందికి టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అవసరమైన చోట్ల అదనపు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసే వెసులుబాటును జిల్లా అడ్మినిస్ట్రేటర్లకు ఉంటుందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక..టీకా కార్యక్రమం కోసం తమ వద్ద ఉన్న ప్రజల సమాచారాన్ని వినియోగించుకోవడానికి కేంద్రానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. తమ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్‌.. రెండు నుంచి 12ఏళ్లలోపు పిల్లలకు వేసేందుకూ తగినదని భారత్‌ బయోటెక్‌ సంస్థ తెలిపింది.

K V D Varma

K V D Varma

Next Story