PM Modi: ఒకేసారి 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: భోపాల్‌లో రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

Jyothi
Published on: 27 Jun 2023 11:52 AM IST
Prime Minister Modi Launched 5 Vande Bharat Trains at a time
X

PM Modi: ఒకేసారి 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ ఐదు వందే భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించారు. భోపాల్‌లో రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. అందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ఈవెంట్ ద్వారా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం, శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ ఐదు రైళ్లు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్‌, ఝార్ఖండ్‌తో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇప్పటికే 17 రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పరుగులు తీస్తు్ండగా, తాజాగా మరో ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో ఈ సంఖ్య 23కి చేరుకుంది.

Jyothi

Jyothi

Next Story