PM Modi: జర్మనీకి బయల్దేరిన ప్రధాని మోడీ

PM Modi: జీ7 సమ్మిట్‌లో పాల్గొననున్న మోడీ

Jyothi
Published on: 26 Jun 2022 7:45 AM IST
Prime Minister Modi is Going to Germany
X

PM Modi: జర్మనీకి బయల్దేరిన ప్రధాని మోడీ

PM Modi: ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న 48వ జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. జర్మనీలోని మ్యునిచ్‌లో ఈ సదస్సు జరుగుతుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జీ7 సమ్మిట్ జరగనుంది. కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జీ 7 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ సదస్సులో భారత్, జర్మనీతోపాటు అర్జెంటీనా, సెనెగల్, ఇండోనేషియా, దక్షిణఫ్రికా దేశాలు అతిథి దేశాలుగా పాల్గొనబోతున్నాయి.

ఈ పర్యటన సందర్భంగా మొత్తం 12 మంది దేశాధినేతలతో మోడీ సమావేశమవుతారు. సదస్సు సందర్భంగా మ్యునిచ్‌లో భారతీయులతో ఏర్పాటు చేసిన ఒక సభలో మోదీ ప్రసంగిస్తారు. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్‌ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్తారు.

Jyothi

Jyothi

Next Story