Narendra Modi: సెప్టెంబర్‌ నెలాఖరులో అమెరికాకు ప్రధాని మోడీ

Narendra Modi: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొననున్న మోడీ *కరోనా పరిస్థితిలు, ఆఫ్ఘన్ పరిణామాలు

Arun Chilukuri
Published on: 4 Sept 2021 1:36 PM IST
Prime Minister Modi Arrives In The US At The End Of September
X

నరేంద్ర మోడీ (ఫోటో ది హన్స్ ఇండియా ) 

Narendra Modi: సెప్టెంబర్‌ నెలాఖరులో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొనున్నారు. కరోనా పరిస్థితిలు, ఆఫ్ఘన్ పరిణామాలు, పర్యావరణ, వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని మోడీ. సెప్టెంబర్ 22, 27 వరకు మోడీ అమెరికా పర్యటన ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 సెప్టెంబర్‌లో హౌడీ మోడీ కార్యక్రమం కోసం అమెరికాలో పర్యటించారు ప్రధాని మోడీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story