పాకిస్థాన్ పై ఒత్తిడి పెరిగింది : బిపిన్ రావత్

పాకిస్థాన్ పై ఒత్తిడి పెరిగింది :  బిపిన్ రావత్
x
Highlights

ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకోక తప్పదని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ మొట్టికాయలు వేసింది. ఉగ్రవాదులకు ఆర్థికసహకారం అందించడం మానుకోవాలని హెచ్చిరించింది.

ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకోక తప్పదని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ మొట్టికాయలు వేసింది. ఉగ్రవాదులకు ఆర్థికసహకారం అందించడం మానుకోవాలని హెచ్చిరించింది. దీనిపై ఇండియా ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. గ్రేలిస్ట్ లో పెట్టడం ఏ దేశానికైనా గట్టి దెబ్బేనని, అలాంటిదీ బ్లాక్ లిస్ట్ లో పెడితే కోలుకోలేదని అన్నారు. కాబట్టి పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ సిఫార్సులు అమలు చేసి తీరాల్సిందేనన్నారు.

ఆర్థిక చర్యలు కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) నిర్ణయించిన 27 అంశాల్లో పాక్ విఫలమైంది. దీంతో ఆ సంస్థ పాకిస్థాన్ ను బ్లాక్ లిస్లులో పెడతామని హెచ్చిరించింది. కాగా.. పాక్ పై ఒత్తిడి పెరుగుతోందని , ఉగ్రవాదలుపై పాక్ చర్యలు తీసుకోక తప్పదనిభారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతి వాతావరణాన్ని నెలకొల్పడానికి ముష్కరులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని బిపిన్ రావత్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories