President Murmu: ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం.. ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’తో సత్కారం

President Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది. తూర్పు తైమూర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ లభించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Aug 2024 8:38 PM IST
President Murmu
X

 President Murmu

President Murmu: తూర్పు తైమూర్ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది. తూర్పు తైమూర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. తూర్పు తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా ఆమెను ఈ పౌర పురస్కారంతో సత్కరించారు. సామాజిక సేవ, విద్యారంగం, మహిళల సాధికారతా విభాగాల్లో ద్రౌపది ముర్ము అందించిన సేవలకు గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ వచ్చిందని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story