British Queen : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: బ్రిటన్ దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు.

Arun Chilukuri
Updated on: 14 Sept 2022 8:00 PM IST
President Droupadi Murmu To Attend Queen Elizabeth IIs Funeral
X

British Queen : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: బ్రిటన్ దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత్ తరఫున ద్రౌపది ముర్ము బ్రిటన్ రాణికి నివాళులు అర్పిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన కానుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ద్రౌపది ముర్ము లండన్​లో పర్యటించనున్నారు. క్వీన్ ఎలిజబెత్2 ఈ నెల 8న మరణించగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బ్రిటీష్ రాయబార కార్యాలయానికి వెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానికి సంఘీభావం తెలుపుతూ భారత్​లో ఈనెల 11న సంతాప దినంగా పాటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story