G20 Summit: జీ-20 సదస్సుకు హాజరుకానున్న ప్రెసిడెంట్ బైడెన్

President Biden to Attend the G-20 Summit
x

G20 Summit: జీ-20 సదస్సుకు హాజరుకానున్న ప్రెసిడెంట్ బైడెన్ 

Highlights

G20 Summit: సెంట్రల్ ఢిల్లీలో మోహరించిన లక్షమంది భద్రతా సిబ్బంది

G20 Summit: జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. అధికారులు భారీ ఏర్పాటు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోడీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్‌డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. ఇవాళ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 10 వరకు సెంట్రల్ ఢిల్లీలోకి ఇతర వాహనాలు రాకుండా అనుమతిని నిషేధించారు అధికారులు. ఆంక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. అనుమతి ఉన్న వాహనాలు మినహా మిగిలిన వాటికి ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు.

సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉండేవారు మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై వారం రోజుల నుంచి ఢిల్లీ పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా భద్రత సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భారత్ వేదికగా జీ-20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు దేశ రాజధానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలు ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేష‌న్‌ను సంద‌ర్శించి, భ‌ద్రతా ఏర్పాట్లపై స‌మీక్షించారు. రైల్వేస్టేష‌న్‌లోకి వ‌స్తున్న‌, పోతున్న వారి క‌ద‌లిక‌ల‌పై దృష్టి సారించారు. ప్రతి బ్యాగును క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. ఇక మ‌ధుర రోడ్, బ‌హెయిరాన్ రోడ్డు, పురానా ఖిల్లా రోడ్, ప్రగ‌తి మైదాన్ మార్గాల్లో గూడ్స్ వెహిక‌ల్స్, క‌మ‌ర్షియ‌ల్ వెహికల్స్, అంత‌ర్ రాష్ట్ర బ‌స్సు సర్వీసులు, లోక‌ల్ బ‌స్సులకు అనుమ‌తి లేద‌ని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.పాలు, కూర‌గాయ‌లు, పండ్లు, మెడిక‌ల్‌కు సంబంధించిన వాహ‌నాల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ట్యాక్సీల‌కు అస‌లు అనుమ‌తి ఉండ‌ద‌ని స్పష్టం చేశారు.

ప్రెసిడెంట్ బైడెన్‌తో పాటు మిగిలిన దేశాధినేతలంతా ఢిల్లీకి రానున్నారు. ఈ వేదిక నుంచి ప్రధాని మోడీ..ఒకే వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత నినాదాన్ని సదస్సులో భారత్‌ మూలమంత్రంగా వినిపించనున్నారు. సదస్సుకు వచ్చే ప్రతి దేశాధినేతకు భారత్‌ మండపం వద్ద సంప్రదాయ రీతులతో ఘనస్వాగతం పలకనున్నారు. దీంతో ఎక్కడా చిన్న భద్రతాలోపం లేకుండా SPG,CISF ఢిల్లీపోలీసులు సహా అన్ని భద్రతా బలగాలు ఢిల్లీ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories