Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 24 Oct 2025 11:15 AM IST
Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
X

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన కలిచివేసిందని మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మృతులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన వారికి 50వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story