కొత్త ఏడాది కరోనాను ఖతం చేస్తాం: ప్రధాని

కొత్త ఏడాది కరోనాను ఖతం చేస్తాం: ప్రధాని
x
Highlights

కొత్త సంవత్సరం వచ్చే వేళ కరోనాను పూర్తిగా తరిమి కొట్టేయగలమా? అవుననే అంటున్నారు ప్రధాని మోడీ. కొత్త ఏడాది కరోనా అంతం అవుతుందనీ, వ్యాక్సినేషన్ దేశ...

కొత్త సంవత్సరం వచ్చే వేళ కరోనాను పూర్తిగా తరిమి కొట్టేయగలమా? అవుననే అంటున్నారు ప్రధాని మోడీ. కొత్త ఏడాది కరోనా అంతం అవుతుందనీ, వ్యాక్సినేషన్ దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామనీ అంటున్నారు అదీ మనదేశంలో తయారైన స్వదేశీ టీకానే అనుమతిస్తామని అన్నారు. ఎల్లుండి అంటే జనవరి 2 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వ్యాక్సినేషన్ డ్రై రన్ కు ముమ్మర ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం అలర్ట్ గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కోరారు. వ్యాక్సినేషన్ కోసం ఏకంగా 83 కోట్ల సిరంజిలను ఆర్డర్ చేశారు. ఎల్లుండి జరిగే మహా యజ్ఞం కోసం అందరూ సిద్ధం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.

ఏపీలో కృష్ణా జిల్లాతో పాటు, పంజాబ్, అసోం, గుజరాత్ లలో డ్రై రన్ నిర్వహించారు. రెండు రోజుల పాటూ జరిగిన ఈప్రక్రియ విజయవంతం అయిందని కేంద్రం కూడా ప్రకటించింది. వ్యాక్సినేషన్ డ్రై రన్ కు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం పంపింది. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా డ్రై రన్ కు సిద్ధపడుతోంది. మరోవైపు టీకా పంపిణీకి అనుమతించాలంటూ భారత్ బయోటెక్ కూడా కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది.

ఏ టైమ్ లోనైనా టీకాలకు అనుమతి లభించే అవకాశం ఉండటంతో కొత్త టీకా యాప్ కోవిన్ పనితీరు, సిబ్బందికి దాని వినియోగంపై అవగాహన పెంచేందుకు డ్రైరన్ ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్ తరలింపు,నిల్వ, కోల్డ్ చెయిన్ లో నిల్వ ఉంచడంలో లోటుపాట్లపై ఈ డ్రై రన్ లో అవగాహన కలుగుతుంది. మరోవైపు భారత్ లో బ్రిటన్ స్ట్రెయిన్ కేసులు 25కు చేరుకోగా, కోవిడ్ రికవరీ రేటు మాత్రం 96 శాతం దాటడం ఊరట కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories