Prasar Bharati Jobs: ప్రసార భారతి నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ పోస్టులు..?

Prasar Bharati Jobs 2022 Newsreader Translator Posts
x

Prasar Bharati Jobs: ప్రసార భారతి నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ పోస్టులు..?

Highlights

Prasar Bharati Recruitment 2022: మీడియా రంగంలో పనిచేయాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్ అని చెప్పవచ్చు.

Prasar Bharati Recruitment 2022: మీడియా రంగంలో పనిచేయాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రసారభారతి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. మంచి జీతంతో పాటు అన్ని సౌకర్యాలు లభిస్తాయి. న్యూస్ రీడర్ & ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 1 నుంచి ప్రారంభమైంది. చివరి తేది ఫిబ్రవరి 28గా నిర్ణయించారు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ (ఎన్‌ఆర్‌టి) ఉర్దూ 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 40 వేల నుంచి 50 వేల మధ్య జీతం లభిస్తుంది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంగ్లిష్ / ఉర్దూ / హిందీ జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్‌లో పిజి / పిజి డిప్లొమా లేదా ఉర్దూలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. ఇది కాకుండా అభ్యర్థి ఏదైనా వార్తా సంస్థలో (ప్రింట్ / టీవీ / డిజిటల్ ప్లాట్‌ఫారమ్ / రేడియో) 3 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ

నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ప్రసార భారతి వెబ్‌సైట్‌లో ప్రచురించిన తేదీ నుంచి 30 రోజులలోపు డాక్యుమెంట్‌లతో పాటు https://applications.prasarbharati.org/ ప్రసార భారతి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడంలో ఏదైనా సమస్య ఉంటే స్క్రీన్‌షాట్‌లతో [email protected]కు ఈ మెయిల్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories