Pramod Sawant: ఇవాళ గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

Pramod Sawant: హాజ‌రుకానున్న‌ మోదీ, రాజ్‌నాథ్ సింగ్, పలువురు ప్రముఖులు...

Shireesha
Updated on: 28 March 2022 7:54 AM IST
Pramod Swant Oath Taking Ceremony as Goa CM Today 28 03 2022 | Live News
X

Pramod Sawant: ఇవాళ గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం 

Pramod Sawant: గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. దీంతో గోవాకు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 7వ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డ్ సృష్టించనున్నారు.

అంతకు ముందు 2019లో ఆయన మొదటిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల 40 స్థానాలు గల గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని బీజేపీ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు తక్కువపడింది. అయితే.. ఎంజీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్ధతు పలికారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజీపీకి మార్గం సుగమమైంది.

Shireesha

Shireesha

Next Story