Punjab Election Results 2022: ఊడ్చేసిన'చీపురు'..కొట్టుకుపోయిన దిగ్గజాలు..

Punjab Election Results 2022: పంజాబ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది.

Arun Chilukuri
Published on: 10 March 2022 4:13 PM IST
Popular Faces Lost in Punjab Election 2022
X

Punjab Election Results 2022: ఊడ్చేసిన‘చీపురు’..కొట్టుకుపోయిన దిగ్గజాలు..

Punjab Election Results 2022: పంజాబ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది. కాంగ్రెస్‌ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) జోరు ముందు కీలక నేతలు సైతం నిలవలేకపోతున్నారు. ఇప్పటికే పంజాబ్​లో ఆప్​ అధికార పగ్గాలు చేపట్టనుండటం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం పంజాబ్‌లో భారీ ఆధిక్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఆప్‌ జోరు ముందు ప్రముఖ నేతలు కూడా నిలవలేకపోయారు. ఏకంగా ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ సహా దాదాపు ప్రముఖ రాజకీయ నేతలందరూ ఓటమిపాలయ్యారు. మాజీ సీఎంలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వంటి దిగ్గజ నేతలను కూడా గెలుపు వరించలేదు. పంజాబ్​ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్​ సిద్ధూ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అమృత్​సర్​ తూర్పు నుంచి బరిలో దిగారు సిద్ధూ. శరోమణి అకాలీదల్ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్ బాదలు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story